బండ్లగూడ డిప్యూటీ తహసిల్దార్ కు వినతి
విశ్వంభర, బండ్లగూడ :- భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు శాలిబండ డివిజన్ ప్రెసిడెంట్ సాయినాథ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం అనంతరం బండ్లగూడ మండల తహసిల్దారు గారికి వినతి పత్రం సమర్పించారు. డివిజన్ ప్రెసిడెంట్ సాయినాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ గ్యారంటీల గారడీ ఆరు అబద్ధాలు 66 మోసాలు కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలన వైఫల్యాల ను ఎండగడుతూ ప్రజా పాలన కుంటుపడిందని కాంగ్రెస్ పాలనలో కమీషన్లకు నిలయంగా మారిందని గ్యారెంటీలను మరచి జేబులు నింపుకోవడమే పనితనంగా పెట్టుకున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బహుదూర్పుర ఇంచార్జ్ బిజెపి వై నరేష్, హైదరాబాద్ పార్లమెంటు జాయింట్ కన్వీనర్ కోటి ధర్మతేజ, భాగ్యనగర్ జిల్లా జనరల్ సెక్రెటరీ ఎడ్ల పండరినాథ్, జిల్లా కార్యవర్గ సభ్యులు పొన్న చలపతి, ఆలూరు శ్రీహరి తదితర నాయకులు పాల్గొన్నారు.



