ప్రభుత్వాసుపత్రి స్థాయిని పెంచాలని నిరాహార దీక్ష
విశ్వంభర, రామన్నపేట : యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకలకు పెంచి 40 కోట్ల బడ్జెట్ ను ఈ అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక నిరాహార దీక్షకు మండల కమిటీ సభ్యులను తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు పూలమాలలు వేసి, వారి దీక్షకు మద్దతుగా ఒకరోజు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యుడు గాజుల ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షుడు బావండ్లపల్లి బాలరాజు మాట్లాడుతూ, ప్రతిరోజు రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి 400 మందికి పైగా ఒపి ద్వారా వైద్యం కోసం వస్తారని, కేవలం 30 పడకల ఆసుపత్రి ఉండడం వలన వారికి వైద్య సదుపాయాలు అందటం లేదని, ప్రతి విషయానికి నల్లగొండకు కానీ, హైదరాబాదుకు కానీ రాస్తున్నారని, కావున ప్రభుత్వం ఈ విషయంపై ఆలోచించి బడ్జెట్లో 40 కోట్లు కేటాయించి, ఆస్పత్రిని 100 పడకల స్థాయికి పెంచాలని కోరారు. సరిపడా డాక్టర్లను నియమించాలని నిరాహార దీక్ష చేస్తున్న సిపిఎం మండల కమిటీ సభ్యులకు మద్దతు తెలుపుతూ కల్లుగీత కార్మిక సంఘం పూర్తిగా దీక్షలు విజయవంతం కావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ అధ్యక్షుడు కునూరు మల్లేశం, కోశాధికారి మునుకుంట్ల లెనిన్, పల్లె సత్యం, తోర్పునూరి శ్రీనివాస్, గుండాల ప్రసాద్, కునూరు గణేష్, అంతటి సత్తయ్య, బావండ్లపల్లి సత్యం, అంతటి నరసింహ, తాళ్లపల్లి జితేందర్, గుడిసె మల్లేశం, గంగాదేవి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.



