పేపర్ క్రాఫ్ట్ పై శిక్షణ
విశ్వంభర, రామన్నపేట: క్యాంపస్ ఏకో బజార్లో భాగంగా సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జ్యూట్ బ్యాగుల తయారీ, పేపర్ క్రాఫ్ట్ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాహత్ ఖానం మాట్లాడుతూ, యువతీ, యువకులు స్వశక్తితో ఎదగడానికి జ్యూట్ బ్యాగులు తయారీ చాలా ఉపయోగపడుతుందని, దాని ద్వారా తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన జ్యూట్ బ్యాగుల తయారీదారు శైలజ మాట్లాడుతూ, జ్యూట్ బ్యాగుల అల్లికలపై, వాటి మార్కెటింగ్ పై విద్యార్థినీ, విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. విద్యార్థినీ, విద్యార్థులు భవిష్యత్తులో తమకు ఉద్యోగాలు రాని ఎడల బాధపడవలసిన అవసరం లేదని, స్వశక్తితో తామే ఉపాధిని కల్పించుకునే స్థాయికి ఎదగాలని, అందుకు ఈ జూట్ బ్యాగ్ ల తయారీ అనేది ఒక అవకాశం అని, అంతే కాకుండా ఇది తమ ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్-ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, అకాడమిక్ కో-ఆర్డినేటర్ జే.చిన్నబాబు, డాక్టర్ సునీత, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ఎం.అనిత, టి.శ్రీనివాసులు, డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, డాక్టర్ రవీందర్రావు, డాక్టర్ రాచమళ్ళ శ్రీనివాస్, ఏఓ జీ.కరుణాకర్, అమర్, జె.నరేష్, ఏ.ఆంజనేయులు, రాధిక, రవి తదితర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.



