ఇఫ్తార్ విందు ల్లో పాల్గొన్న టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

ఇఫ్తార్ విందు ల్లో పాల్గొన్న టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

విశ్వంభర,సంగారెడ్డి :  సంగారెడ్డి నియోజకవర్గం లో జరిగిన పలు ఇఫ్తార్ విందుల్లో టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. కొండాపూర్ మండలం మల్కా పూర్ లో జరిగిన ప్రభుత్వ ఇఫ్తార్ విందు లో నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మల్కా పూర్ సర్పంచ్ అనిల్, ఉప సర్పంచ్ ప్రవీణ్ లతో పాటు సంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, నాయకులు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  సంగారెడ్డి పట్టణంలోని 11వ వార్డు మసీదు వద్ద మాజీ వార్డు కౌన్సిలర్ గడ్డం సరిత–తులసి రామ్ ఆధ్వర్యంలో దావత్–ఇ–ఇఫ్తార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ కార్యక్రమానికి స్థానిక ముస్లిం సోదరులు, ప్రజాప్రతినిధులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉపవాస విరమణ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటీజీఐఐసి చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసం సోదరభావం, సహనం, పరస్పర గౌరవం, సేవా భావాన్ని పెంపొందించే పవిత్ర కాలమని అన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, సఖ్యతతో జీవించాలనే సందేశాన్ని రంజాన్ పండుగ ఇస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ షఫీ, జైపాల్ రెడ్డి, స్థానిక నాయకులు, ముస్లిం మత పెద్దలు, యువకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.WhatsApp Image 2026-03-16 at 8.51.05 PM (1)