ఎమ్మెల్యే ఇంటి పై దాడి హేయమైన చర్య
On
విశ్వంభర, నాగారం: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఇంటిపై కోడి గుడ్లతో దాడి చేయడం హేయమైన చర్య అని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బయ్యం వెంకన్న అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని ఆయన నివాసం పై బీ జే వై యం నాయకుల దాడిని తీవ్రంగా ఖండించారు. దళిత ఎమ్మెల్యే కావడం వలన బీజేవైఎం నాయకులు దాడి కి పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యే మాట్లాడిన మాటలను రాజకీయం చేయడం సిగ్గుచేటు అని అన్నారు. ఆయన ఎవరినీ ఉద్దేశపూర్వకంగా అవమానించేలా మాట్లాడలేదని కొంతమంది దాన్ని వక్రీకరించి రాజకీయం చేస్తున్నారని అన్నారు. బీజేవైఎం నాయకులు ఎమ్మెల్యేకి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.



