ఘనంగా స్వపరిపాలన దినోత్సవం 

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం 

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, దుబ్బాక గ్రామంలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తమ పాత్రలతో అలరించారు. కలెక్టరుగా రావుల శివరాం, పాఠశాల హెడ్మాస్టరుగా గుండాల వైష్ణవి, విద్యాశాఖ మంత్రిగా జి.అక్షయ, ఎమ్మెల్యేగా కంబాలపల్లి నిత్యశ్రీ, డీఈఓగా దాసరి కాలేబ్, ఎమ్మార్వోగా మద్దెగళ్ళ నిహారిక, ఎంఈఓగా జి.శ్రీనిత్య, సర్పంచ్ గా సింగారపు హర్షవర్దన్ లు తమ తమ బాధ్యతలను నిర్వర్తించి ఆకట్టుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులు గ్రామ సర్పంచ్ గట్టు నర్సింహ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు దొడ్డి స్వామి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కొలను లలిత  మాట్లాడుతూ, విద్యార్థులైన మీరు గొప్ప పౌరులుగా ఎదిగి దేశానికి, సమాజానికి మంచి పేరు తీసుకు రావాలని, అందుకు విద్యే గొప్ప పునాది అని, బాగా చదువుకుని అందరూ ఉన్నత స్థితికి చేరాలని హితబోధ చేశారు. అనంతరం ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ఉప-సర్పంచ్ గుండాల రమేశ్, ఏఏపిసి చైర్మన్ తుమ్మల పల్లవి, ఉపాధ్యాయులు పి.రేణుక, డి.ధనమ్మ, సి.హెచ్.రవి, వాలంటీర్లు సుస్మిత, లక్ష్మీ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

Tags: