గ్రామాలను సందర్శించిన ఎంపీడీవో 

గ్రామాలను సందర్శించిన ఎంపీడీవో 

విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి. జలందర్ రెడ్డి,  నాథళ్లగూడెం గ్రామాన్ని సందర్శించారు.  సర్పంచ్ మోటే జంగమ్మ , గ్రామ కార్యదర్శి కూడా పాల్గొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి, అందుబాటులో ఉన్న సరుకుల నాణ్యత మరియు పరిమాణంపై విచారణ చేశారు. గర్భిణీ స్త్రీలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, వైద్య సదుపాయాల ను తెలుసుకున్నారు. చిన్నారుల బరువు కొలిచి, వారి ఎత్తుకు అనుగుణంగా ఉండాల్సిన ప్రామాణిక బరువుపై ఆరా తీశారు.  గ్రామ నర్సరీని సందర్శించి, అక్కడ ఉన్న మొక్కలు, నాటిన మొక్కల పరిస్థితిని పరిశీలించారు. మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పోయడం, సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించి, హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి, విద్యార్థుల హాజరుపై వివరాలు తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులకు స్వయంగా ఆహారం వడ్డించారు. గ్రామంలో పర్యటిస్తూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను కలుసుకుని, ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

Tags: