గూండా రాజకీయాలను సహించబోము. కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డ. -రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్
బిజెపి కార్యకర్తలపై జరిగిన దాడికి నిరసనగా చండూరులో వ్యాపార సంస్థలు బంద్.
On
బంద్ లో పాల్గొన్న రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు గంగిడి మనోహార్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి
విశ్వంభర, చండూర్ :- మున్సిపాలిటీలో ఆదివారం బిజెపి కార్యకర్తలపై జరిగిన దాడికి నిరసనగా చండూరు పట్టణంలో బిజెపి నాయకులు వ్యాపార సంస్థలు బంద్ చేయించారు. ఈ బంద్ లో పాల్గొన్న రాష్ట్ర ప్రధానకార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్, బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు గంగిడి మనోహార్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పథకం ప్రకారం గతంలో హెచ్చరించిన మాదిరిగానే నిన్న దాడి చేశారు, ఈ దాడిని ప్రజాస్వామ్యం నమ్మే యావత్ ప్రజాస్వామ్యాన్ని నమ్మేట్టు ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నడూ జరిగి ఉండవు. ఇది పథకం ప్రకారము బిజెపి కార్యకర్తలను హత్య చేయడానికి ప్లాన్, మున్సిపల్ ఎలక్షన్లు జరిగి నెల రోజులు కాకముందుకే చండూరులో గుండా రాజకీయాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ నాయకులకు బుద్ధి రావాలని బిజెపి బంధు ప్రకటించింది. దానికి అనుగుణంగా చండూరు మున్సిపాలిటీ ప్రజలు స్వచ్ఛందంగా బందు పాటించారు. దానికి భారతీయ జనతా పార్టీ తరఫున చండూరు మున్సిపాలిటీ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. పథకం ప్రకారమే బిజెపి కార్యకర్తల పై దాడి జరిగిందని, గతంలోనే భయభ్రాంతులకు గురి చేశారు కాంగ్రెస్ నాయకులు.ఈ దాడిని ప్రజలందరు ఖండించాలి.పథకం ప్రకారమే బిజెపి కార్యకర్తలను హత్య చేయడానికి యత్నించారని, తూతు మంత్రం గా అరెస్టు, చేసి రాత్రికి రాత్రే వదిలిపెట్టారు.మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన నెల రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు గూండాల్ల వ్యవహరిస్తున్నారనీ మండిపడ్డారు. దాడికి సంబందించి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. నల్లగొండ జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయని దుయ్యబట్టారు. ఫిర్యాదుల పేర్కొన్న 16 మందిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.కేసులు నీరు కార్చే పనిలో పోలీసులు ఉన్నారని బీజేపీ నాయకులూ తెలిపారు. కాంగ్రెస్ మంత్రులు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసి పాలనను గాలికి వదిలేసారనీ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ ,బొమ్మరబోయిన రాజు,అన్నెపర్తి యాదగిరి ,ముదిగొండ ఆంజనేయులు,పిన్నింటి నరేందర్ రెడ్డి ,వంగూరి రాఖీ ,బూతరాజు శ్రీహరి,సోమ నర్సింహా ,రంగా రెడ్డి ,మురళి మనోహర్ రెడ్డి,కోమటి వీరేశం ,బూతరాజు స్వామి ,సోమ శంకర్ ,నకిరేకంటి లింగస్వామి,పడసనబోయిన శ్రీను ,ఆవుల అశోక్ ,పాశం శ్రీనివాస్ రెడ్డి ,మిర్యాల వెంకటేశం మరియు తదితరులు పాల్గొన్నారు.



