కురుమ సంఘం నూతన కమిటీ
విశ్వంభర, మహేశ్వరం: మహేశ్వరం మండల కేంద్రంలో శ్రీ బీరప్ప మంఖాలమ్మ గుడి దగ్గర కురుమ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మహేశ్వరం మండల కురుమ సంఘం అధ్యక్షులు పోల్కం బాలయ్య ఆద్వర్యంలో మహేశ్వరం పెద్ద కురుమ ఆశనగారి మల్లేష్ కురుమ సెల్వోజీ పోల్కం రవి కురుమ మహేశ్వరం గ్రామ ఉపసర్పంచ్ జోరల రమేష్ కురుమ, కుల పెద్దల సమక్షంలో మహేశ్వరం నూతన గ్రామ అధ్యక్షుడిని మొత్తం కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ అధ్యక్షులుగా జోరల శ్రీశైలం కురుమ ఉప అధ్యక్షులుగా ముచ్చంతల మహేందర్ కురుమ కాట్నం రాఘవేందర్ కురుమ , ప్రధాన కార్యదర్శిగా మిద్దింటి బాలరాజ్ కురుమ , కోశాధికారిగా పోల్కం మహేందర్ కురుమ, ఒగ్గు శ్రీకాంత్,ను ఎన్నికయ్యారు. ఈ కమిటీకి ముఖ్య సలహాదారులుగా పోల్కం బాలయ్య కురుమ, పోల్కం కిష్టయ్య కురుమ, మిద్దింటి యాదగిరి కురుమ, కాట్నం పర్వతాలు కురుమ, ఒగ్గు శ్రీశైలం కురుమలను నియమించారు.



