ఏఎస్ఐ భాస్కర్‌కు  సన్మానం

ఏఎస్ఐ భాస్కర్‌కు  సన్మానం

విశ్వంభర, కాచిగూడ  : కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన జి. భాస్కర్ మంగళవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో తోటి అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించి సేవలను కొనియాడారు. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వీర కౌశిక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాస్కర్‌కు పూలమాలలు, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో ఆయన చూపిన నిబద్ధత, సేవాభావాన్ని అధికారులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో: ఎస్సై వీరమల్లు ఏఎస్ఐలు విజయకుమార్ జ్ఞానేశ్వర్ కేటి నాయక్ ఠాకూర్ సింగ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

🕒 01 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tribute-to-asi-bhaskar/article-17513

Tags: