కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ 

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ 

  •  శాసనసభ సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి

విశ్వంభర,  సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాలకు అందించిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్  చెక్కులను మహిళలు సద్వినియోగపరుచుకోవాలని   సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో  జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్ (ఎస్), చివ్వెంల, పెన్ పహాడ్,  సూర్యాపేట అర్బన్ రూరల్ మండలాలకు చెందిన 150 మంది లబ్ధిదారులకు రూ.1,50,17,400 కోట్ల విలువైన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు  జగదీష్ రెడ్డి మాట్లాడుతూ  కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని వీటిని ప్రతి ఒక్క పేదింటి మహిళ  ద్వినియోగపరుచుకోవాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణరెడ్డి, గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత, సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవరావు తదితరులు పాల్గొన్నారు.

🕒 01 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-kalyana-lakshmi-cheques/article-17523

Tags: