హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్
విశ్వంభర, హుస్నాబాద్: హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు దశల కౌన్సెలింగ్ అనంతరం మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ పంచదార శ్రీదేవి తెలిపారు.ప్రస్తుతం సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.మొదటి రెండు విడతల కౌన్సెలింగ్‌లో ర్యాంకు సాధించినప్పటికీ సీట్లు పొందని విద్యార్థులతో పాటు, పాలీసెట్ పరీక్ష రాసి ఉత్తీర్ణులు కాని పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా స్పాట్ అడ్మిషన్‌కు అర్హులు అని తెలిపారు. రోస్టర్ విధానం, మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుందని వెల్లడించారు. స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ జూలై 4, 2026 (శనివారం) ఉదయం 11:30 గంటలకు ప్రభుత్వ పాలిటెక్నిక్, హుస్నాబాద్‌లో నిర్వహించబడుతుంది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉదయం 11 గంటలలోపు కళాశాలకు చేరుకోవాలని సూచించారు. జూలై 1 నుంచి స్పాట్ అడ్మిషన్ దరఖాస్తు ఫారాలు కళాశాలలో అందుబాటులో ఉంటాయి. పూర్తిగా నింపిన దరఖాస్తులను జూలై 3లోపు కళాశాలలో సమర్పించాలి. అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు అసలు ధ్రువపత్రాలతో పాటు రూ.6,000 ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలి. ఫీజు చెల్లింపు పూర్తయిన అనంతరం సీటు కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుందని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు.