విద్యుదాఘాతంతో బ్యాండు మేళం శ్రామికుడు మృతి

 విశ్వంభర, హాలియా :  విద్యుదాఘాతంతో బ్యాండ్ మేళం శ్రామికుడు మృతి చెందిన సంఘటన హాలియా పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం అనుముల గ్రామంలోని కేవీ కాలనీకి చెందిన తక్కెళ్ళపల్లి దుర్గయ్య వయస్సు 40 సంవత్సరాలు గల వ్యక్తి సోమవారం రాత్రి పట్టణంలోని ప్రాథమిక పాఠశాల వెనుక శుభకార్యానికి బ్యాండ్ మేళం వాయించేందుకు వెళ్లాడు. తొమ్మిది గంటల సమయంలో దుర్గయ్య మూత్ర విసర్జన కోసం వెళ్లిన సమయంలో కరెంట్ స్తంభం వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ గురై అక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో కరెంటు స్తంభం వద్ద ట్రాన్స్ఫారం వైర్లు ఉండడమే ప్రమాదానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు.

🕒 01 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/crime/band-melam-worker-died-due-to-electric-shock/article-17551

Tags: