ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: కలెక్టర్ గరిమ అగ్రవాల్
విశ్వంభర, రాజన్న సిరిసిల్ల జిల్లా: విద్యా రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలను ఉత్తమ విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దుతోందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నూతన తరగతి గదులను కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం జాతీయ స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించి, ఉద్యోగ విరమణ పొందిన జిల్లా విద్యాశాఖ అధికారి జగన్ మోహన్ రెడ్డి, ఓ ఉపాధ్యాయుడిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ పాఠశాలలో 400 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారని, మెరుగైన బోధన, వసతుల కారణంగా తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచుకుంటున్నారని చెప్పారు. విద్యార్థులు లక్ష్యంతో చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవడంతో పాటు సమాజానికి సేవ చేయాలని సూచించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ తాను ఈ పాఠశాల పూర్వ విద్యార్థినని గుర్తు చేసుకుంటూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. బొప్పాపూర్ పాఠశాల అభివృద్ధికి రూ.1 లక్ష విరాళం ప్రకటిస్తూ, అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ సబేరా బేగం, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.