సిగాచీ బాధితులకు న్యాయం చేయాలి
విశ్వంభర, హైదరాబాదు : సిగాచీ ఫార్మా పేలుడు ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రకటించిన పరిహారాన్ని వెంటనే అందించి, గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం కల్పించేలా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ప్రొఫెసర్ హరగోపాల్ ప్రభుత్వాన్ని కోరారు. సిగాచీ ఫార్మా కంపెనీ పేలుడు ఘటనకు ఏడాది పూర్తైన సందర్భంగా మంగళవారం హైదరాబాదు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అశోక్ కుమార్, కన్నెగంటి రవి అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పేలుడు ఘటనలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.1 కోటి పరిహారం ఇప్పటికీ అందకపోవడం ఆందోళనకర మన్నారు. గాయపడిన కార్మికులకు పూర్తి స్థాయిలో వైద్యం, పునరావాసం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాల సమస్యలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలించి, వారికి న్యాయం జరిగేలా తక్షణ చర్యలు చేపట్టాలని హరగోపాల్ అన్నారు. ఇటువంటి పారిశ్రామిక ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగే వరకూ వారి పోరాటానికి మద్దతుగా ఉంటామన్నారు. బాధితులు తమ గోసను మీడియా ముందు వెలుబుచ్చారు..ఈ కార్యక్రమంలో: పర్యావరణ వేత్త డాక్టర్ కే. బాబూరావు, పౌరహక్కుల సంఘం నేత జీవన్ కుమార్, ఎన్‌జీవో సంస్థ ప్రతినిధి వెంకటరెడ్డి, సామాజికవేత్త సంఘమిత్ర తదితరులు పాల్గొని సిగాచీ ఫార్మా పేలుడు ఘటనలో మృతి చెందిన వారికి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు.