కింది బజార్ చెరువు కట్ట సుందరీకరణ పనులను పరిశీలించిన జగ్గారెడ్డి,నిర్మల

  • రూ.500 కోట్లతో చెరువు ను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దేలా ప్రణాళికలు
  • త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన

విశ్వంభర, సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలోని కింది బజార్ చెరువును రూ. 500 కోట్లతో అభివృద్ధి చేసే దిశగా జగ్గారెడ్డి, టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి వేగం పెంచారు. సంబంధిత శాఖల అధికారులతో కలిసి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని హంగులతో కింది బజార్ చెరువును అభివృద్ధి చేసేలా చేపట్టాల్సిన పనుల గురించి ఈ సందర్భంగా చర్చించారు. కిలోమీటరున్నర పొడవున ఉన్న చెరువు కట్టను అభివృద్ధి చేయడంతో పాటు, నెక్లెస్ రోడ్, పార్కులు ఏర్పాటు చేసే అంశాలపై చర్చించారు. సంగారెడ్డి పరిసర ప్రాంత ప్రజలతోపాటు, హైదరాబాద్ నుంచి వచ్చే వారికి ఆహ్లాదం పంచేలా కింది బజార్ చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని జగ్గారెడ్డి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.

*సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన!*

Read More నకిలీ వధూవరుల ఫోటోలతో భారీ స్కాం 

త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కింది బజార్ చెరువు కట్ట పనులకు శంకుస్థాపన చేసేలా పనుల్లో వేగం పెంచాలని, అవసరమైన అన్ని ప్రతిపాదనలు పూర్తి చేయాలని జగ్గారెడ్డి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. రెండేళ్లలో ఈ పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా ఈ ప్రాంతాన్ని అందుబాటులోకి తేవాలన్నారు.

చెరువుల వద్దకు వెళ్లి పరిశీలన..

సమీక్ష నిర్వహించిన అనంతరం జగ్గారెడ్డి, నిర్మల సంబంధిత అధికారులతో కలిసి కింది బజార్ చెరువు కట్ట వద్దకు వెళ్లారు. అలుగు వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏమేం పనులు చేయాలనే అంశమై ఈ సందర్భంగా జగ్గారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు.

🕒 20 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/jaggareddy-nirmala-who-inspected-the-beautification-works-of-the-following/article-16806

Tags: