హుస్నాబాద్ అమరుల స్థూపం స్థలాన్ని పరిరక్షించాలి
- మంత్రి పొన్నం ప్రభాకర్‌కు జేఏసీ వినతి
విశ్వంభర, హుస్నాబాద్ :సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం అందజేసి హుస్నాబాద్ అమరుల స్థూపం స్థలాన్ని కబ్జాదారుల నుంచి రక్షించాలని కోరారు. అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ హుస్నాబాద్ లోని సర్వే నంబర్లు 1189, 275లో ఉన్న సీలింగ్ భూమిపై సమగ్ర విచారణ జరిపించి, అక్రమ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ భూమి పట్టాదారుగా "హుస్నాబాద్ అమరుల స్థూపం" పేరుతో నమోదు ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో "అమరుల స్మృతి వనం" ఏర్పాటు చేసి, తెలంగాణ చరిత్రను భావితరాలకు పరిచయం చేసే విధంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఇందులో సర్వాయి పాపన్న, గోనెల పాపన్న, బుచ్చవ్వ, అనభేరి ప్రభాకర్ రావుతో పాటు తెలంగాణ సాయుధ పోరాట యోధుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే తెలంగాణ అమరుల స్థూపం, అమరుల చరిత్ర, ఈ ప్రాంత పోరాట యోధుల చరిత్రను వివరించే ప్రదర్శన కేంద్రం, క్రీడామైదానం, గద్దర్,బెల్లి లలిత కళాభారతి, విద్యార్థులకు ఉపయోగపడే ఆడిటోరియం నిర్మించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ వినతిపత్రాన్ని సమర్పించిన వారిలో జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి, కో-కన్వీనర్లు మేకల వీరన్న యాదవ్, డ్యాగల సారయ్య, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి గడిపే మల్లేష్, అయిలేని మల్లారెడ్డి, గూడ పద్మ, బీఆర్ఎస్ హుస్నాబాద్ పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ అన్వర్, చిత్తారి శ్రీనివాస్, కౌన్సిలర్ గాదెపాక రవీందర్, బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పశ్చిమట్ల రవీందర్ గౌడ్, లోక్‌సత్తా జిల్లా బాధ్యులు మల్కిరెడ్డి మోహన్ రెడ్డి, ఓపిడిఆర్ రాష్ట్ర నాయకులు విలసాగరం గోవర్ధన్, జేఏసీ నాయకులు పెట్టెం కుమారస్వామి, నాంపల్లి సమ్మయ్య, అబ్బరబోయిన రవి, అమరుల బంధుమిత్రుల సంఘం నాయకులు గజవెల్లి మురళి, సీపీఐ నాయకులు కోహెడ కొమురయ్య, నాయకులు జెరిపోతుల ఆంజనేయులు, పొన్నాల వినోద్ తదితరులున్నారు.