పోలీస్ స్టేషన్ లో సీపీ ఆకస్మిక తనిఖీ 

పోలీస్ స్టేషన్ లో సీపీ ఆకస్మిక తనిఖీ 

విశ్వంభర, ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో  రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, ప్రజలకు అందుతున్న సేవలపై ప్రత్యేకంగా ఆరా తీసారు. చట్టం అమలులో కఠినంగా ఉండాలని శాంతి భద్రతల పరిరక్షణలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలనిఆయన అన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతీ ఒక్కరితో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు  పోలీస్ వ్యవస్థ పై నమ్మకం పెరిగేలా ప్రతి ఫిర్యాదు తీసుకుని బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ సిబ్బంది పనితీరుని అభినందించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటి పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ ఎక్కువగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం డిసిపి కె.నారాయణ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపి కే పి వి రాజు, సీఐ మహేందర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ జితేందర్ రెడ్డి, ఎస్ఐ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

🕒 01 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/cp-surprise-check-in-police-station/article-17575

Tags: