షాద్‌నగర్‌లో చారిత్రక ఫిరంగులు మాయం..?

షాద్‌నగర్‌లో చారిత్రక ఫిరంగులు మాయం..?

  •  విచారణ జరపాలి: బక్కని నర్సింహులు

విశ్వంభర, జీహెచ్‌ఎంసీ: షాద్‌నగర్ మున్సిపల్ కార్యాలయం వెనుక ఉన్న చారిత్రక ఫిరంగుల నిర్లక్ష్య స్థితిపై మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో అక్కడ రెండు ఫిరంగులు ఉండేవని, ప్రస్తుతం ఒకటి మాత్రమే కనిపిస్తోందని, మరో ఫిరంగి ఏమైందనే దానిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, దుమ్ము ధూళితో కప్పబడి మూలకు పడేసిన ఫిరంగిని స్వయంగా శుభ్రం చేసి రంగు పూయించారు. గతంలో రూ.2 లక్షలు మంజూరు చేసి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఫిరంగిని ఏర్పాటు చేసి సంరక్షిస్తామని చెప్పినా, నిధులు ఏమయ్యాయో, ఫిరంగిని ఎందుకు నిర్లక్ష్యంగా పడేశారో అధికారులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. షాద్‌నగర్‌కు చారిత్రక ప్రాధాన్యం ఉందని, ఒకప్పుడు ఈ ప్రాంతంలో అనేక కోటలు, ఫిరంగులు ఉండేవని గుర్తు చేశారు. చారిత్రక వారసత్వానికి గుర్తుగా ఉన్న ఫిరంగులను సంరక్షించి భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మరో ఫిరంగి అదృశ్యమైన విషయంపై షాద్‌నగర్ సహాయ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే పురావస్తు శాఖ అధికారులు కూడా ఈ అంశంపై దృష్టి సారించి విచారణ చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

🕒 01 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/historical-cannons-destroyed-in-shadnagar/article-17508

Tags: