ఏఐటియుసి జిల్లా మహాసభలను జయప్రదం చేయండి
విశ్వంభర, డిండి: మండలం కేంద్రంలో ఏఐటియుసి మండల కార్యవర్గ సభ్యుల సమావేశం భుష్పక లింగమయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ, భారతదేశంలో 1920 అక్టోబర్ 31న ఆవిర్భవించిన మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ స్వాతంత్రానికి పూర్వమే కార్మిక సంఘాల చట్టం, ఫ్యాక్టరీల చట్టం ,శ్రామిక విధానాల చట్టం, కనీస వేతనాల చట్టం , ఏఐటీయూసీ సాధించడం జరిగిందని చెప్పారు. ఏఐటీయూసీ నాయకత్వంలో అనేక పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న ముఖ్యమైన 44 కార్మిక చట్టాలను కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత 4 కోడ్లుగా కుదించి , కార్పొరేట్ సంస్థలకు గుత్త పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్మికులకు నష్టం కలిగించే విధంగా మార్పు చేస్తుంది. నేటికీ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్, కాంటాక్ట్ కార్మికుల, జీవితాలు మారలేదు .కనీస వేతనాలు లేక పిఎఫ్, ఈఎస్ఐ ,అమలు నోచుకోక శ్రమ దోపిడికి గురవుతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడంలో ప్రభుత్వం విఫలమయింది. అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నం భోజనం కార్మికులు, ఐ.కె.పి. భవన నిర్మాణ కార్మికులు ,ప్రభుత్వ హాస్టల్లో వంట కార్మికులు, మిషన్ భగీరథ కార్మికులు ,అమాలి, ఆటో డ్రైవర్స్ ,స్కూల్ స్కావెంజర్స్, గ్రామపంచాయతీ, కార్మికులు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐటిసి మండల అధ్యక్షులు భు ష్పాక లింగమయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి ఎలిమినేటి దేవయ్య, గ్రామపంచాయతీ మండల అధ్యక్షులు రామావత్ జవహర్ లాల్, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు భూప్పాక సాయిలు ,తిరుపతయ్య , కార్మిక సంఘం మండల అధ్యక్షులు బల్మూరి లక్ష్మయ్య, రాజా, తదిరులు పాల్గొన్నారు.