విద్యాసేవకు వీడ్కోలు.. సమాజసేవకు శ్రీకారం..
విశ్వంభర, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ తెలుగు ఉపాధ్యాయుడు కాయిత శ్రీనివాస్ రెడ్డి సిరిసిల్ల జిల్లా కుసుమరామయ్యపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుదీర్ఘకాలం సేవలందించి మంగళవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆయనకు సహచర ఉపాధ్యాయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మిత్రబృందం మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయ వృత్తిలో క్రమశిక్షణ, అంకితభావం, విద్యార్థుల పట్ల ప్రేమాభిమానాలతో విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో చురుకుగా పాల్గొంటూ స్వచ్ఛంద సంస్థల ద్వారా నిరుపేదలకు అండగా నిలవాలని, విద్య, సామాజిక సేవ, సేవా కార్యక్రమాల్లో తన అనుభవాన్ని వినియోగిస్తూ జీవితాన్ని మరింత సార్థకం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కక్కేర్ల మహేందర్, ఏ. రఘుపతి రెడ్డి, గడ్డం లక్ష్మారెడ్డి, టీ. సంపత్ రెడ్డి, పాపిరెడ్డి, బి. రాజమల్లయ్య, తోట సమ్మయ్య, భీమేశ్వర్, రాజిరెడ్డి తదితరులు పాల్గొని శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.