కీసరలో వైద్యం, విద్య మెరుగుపరచాలి: సీపీఎం

విశ్వంభర, మేడ్చల్ : కీసర మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ హైస్కూల్‌ను సీపీఎం జిల్లా నాయకులు మంగళవారం సందర్శించి సమస్యలను పరిశీలించారు. పీహెచ్‌సీలో స్టాఫ్ నర్సులు, వాచ్‌మన్‌ను నియమించాలని, బండ్లగూడ–అహ్మద్‌గూడ ప్రాంతంలో కొత్త పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ హైస్కూల్‌లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి, హిందీ, సాంఘిక శాస్త్రం, కంప్యూటర్ ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. విద్య, వైద్య రంగాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.సత్యం డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎర్ర అశోక్, జి.శ్రీనివాసులు, బంగారు నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

🕒 01 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/cpm-should-improve-medical-education-in-keesara/article-17573

Tags: