మునిగలవీడు లో టీచర్స్ ఖాళీలు భర్తీ చేయాలి
- బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పాపారావు
విశ్వంభర, నెల్లికుదురు : మండలం లోని మునిగలవీడు ప్రైమరీ స్కూల్ లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నల్లాని పాపారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేసినట్లు పాపారావు తెలిపారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సరిపోను టీచర్లు లేరని దీంతో పేదరికంలో ఉన్నప్పటికీ అప్పులు తెచ్చి తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపించే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.2 ఎస్ జి టి, ఒక ఫ్రీ ప్రైమరీ కి చెందిన పోస్టు ఖాళీగా ఉన్నాయని వీటిని వెంటనే భర్తీ చేస్తూ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరింత మందిని ఉపాధ్యాయులను కేటాయించాలని కోరారు.