ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి

  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్. కృష్ణయ్య

విశ్వంభర, హైదరాబాదు :  రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు సంబంధించిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి, జీవో నంబర్ 8, 9లను రద్దు చేసి పాత విధానంలోనే పథకాన్ని కొనసాగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన హైదరాబాదు జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత మూడు సంవత్సరాలుగా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏండ్ల పోరాటాల ఫలితంగా అమలులోకి వచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని బలహీనపరచకుండా కొనసాగించాలని కోరారు. బడ్జెట్ లేదనే నెపంతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని హితవు పలికారు. రాష్ట్రానికి తగిన ఆదాయ వనరులు ఉన్నప్పటికీ విద్యార్థుల విద్యకు అవసరమైన నిధులు కేటాయించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వానికి 20 వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తే విద్యార్థులకు 2 వేల కోట్లు విడుదల చేస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో మాదిరిగా మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలన్నారు. విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సూచించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశం, బీసీ సంఘం అధ్యక్షులు రాజేందర్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పగిళ్ల సతీష్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ ఐక్య వేదిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అనంతయ్య బీసీ నేతలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

🕒 01 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/fee-reimbursement-dues-are-payable-immediately/article-17561

Tags: