కమాన్‌పూర్ పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలి: తాటికొండ శంకర్
విశ్వంభర, కమాన్‌పూర్: కమాన్‌పూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు తాటికొండ శంకర్ డిమాండ్ చేశారు. మంగళవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి పీహెచ్‌సీని సందర్శించిన ఆయన ఆసుపత్రిలో మందుల కొరత, స్టాఫ్ నర్సుల లేమి, పారిశుద్ధ్య సమస్యలు, తాగునీటి సౌకర్యాల కొరతపై ఆందోళన వ్యక్తం చేశారు. నలుగురు స్టాఫ్ నర్సులు ఉండాల్సి ఉండగా ఒక్కరు కూడా లేకపోవడం దురదృష్టకరమని, వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఆసుపత్రి ఆవరణలోని శిథిలావస్థకు చేరిన క్వార్టర్లకు మరమ్మతులు చేపట్టాలని లేదా కొత్త క్వార్టర్లు నిర్మించాలని, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే కమాన్‌పూర్ పీహెచ్‌సీని 30 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బొమ్మగాని అనిల్, కొట్టె భూమయ్య, గుర్రం లక్ష్మీమల్లు, దండె కిషన్, కుందారపు సత్యనారాయణ, తోట రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.