జూలై  ఒకటి నుండి జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలు 

: ఎస్పీ నరసింహ 

 విశ్వంభర, సూర్యాపేట:  శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా, జిల్లాలో ఉన్న ప్రశాంత వాతావరణం భంగం కాకుండా, సవ్యంగా కొనసాగించడానికి జూలై ఒకటి వ తేదీ నుండి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నరసింహ తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 30 పోలీస్ ఆక్ట్ అమల్లో ఉన్నందున జిల్లాలో డిఎస్పి లేదా ఆ పై స్థాయి అధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమి గుడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని మరియు సన్నాహాలు చేయరాదని తెలిపారు. నిషేధిత ఆయుధాలు, కత్తులు, కర్రలు, దుడ్డు కర్రలు, తుపాకులు, పేలుడు పదార్థాలు, దురుద్దేశంతో నేరాలను ఉసిగొలిపేటువంటి ఆయుధాలు కలిగి ఉండరాదని తెలిపారు. ప్రజా జీవనానికి ఇబ్బంది దారి తీసే ప్రజా సమావేశాలు, జన సమూహం లాంటివి పూర్తిగా నిషేధించబడ్డాయని తెలిపారు. అధిక శబ్దం వచ్చే స్పీకర్లు, డీజేలు వంటివి వాటికి అనుమతులు లేవని తెలిపారు. ప్రచార రథాలు, మైకులు, తదితర అధిక శబ్దం పరికరాలు నిషేధించబడ్డాయని సూచించారు. చట్ట ప్రకారం జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ ఆక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలకు తప్పవు అని సూచించారు.  నిబంధనలను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు పాటించాలని తెలిపారు. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న ముందస్తుగా దరఖాస్తు చేసుకొని అనుమతులను పొందాలని సూచించారు.

🕒 01 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/implementation-of-the-police-act-across-the-district-from-july/article-17547

Tags: