స్థల వివాదంలో మంత్రిపై అసత్య ప్రచారం ఆపాలి
- హుస్నాబాద్ కాంగ్రెస్ నేతలు
విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ అమరవీరుల స్తూపం స్థల వివాదంలో రాష్ట్రమంత్రికి 20 గుంటల భూమి లబ్ధి చేకూరిందన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు వడ్డేపల్లి వెంకటరమణ స్పష్టం చేశారు. హుస్నాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రి పేరుపై 20 గుంటల భూమి కేటాయించారనే ఆరోపణలు చేస్తున్న నాయకులు తమ వద్ద ఆధారాలుంటే ప్రజల ముందుంచాలని సవాల్ విసిరారు. ఈ అంశంపై బహిరంగ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.అమరవీరుల స్తూపం స్థల వివాదాన్ని అడ్డుపెట్టుకుని కావాలనే మంత్రి పొన్నం ప్రభాకర్‌ను రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే నూతన మున్సిపల్ పాలకవర్గంపై రూ.50 లక్షలు చేతులు మారాయంటూ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు ఈ స్థల అంశంపై ఎప్పుడూ మాట్లాడలేదని, ఇప్పుడు మాత్రం మంత్రి ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. స్తూపం ధ్వంసం కావడానికి పలు కారణాలు ఉండొచ్చని, ఆ విషయాలపై స్థానిక ప్రజలకు పూర్తి అవగాహన ఉందన్నారు. స్థలానికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకురావాలని, కానీ నిరాధార ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు.సామాన్య కుటుంబం నుంచి కష్టపడి ఎదిగి మంత్రి స్థాయికి చేరుకున్న నాయకుడిపై అసత్య ప్రచారాలు చేసే ముందు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, స్థానిక కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.