పార్టీ పటిష్టత కోసం కృషి చేయండి
విశ్వంభర,పెద్ద శంకరంపేట: సంగారెడ్డి జిల్లాలో బిజెపి పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి సూచించారు. నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు యం విజయపాల్ రెడ్డి స్వగ్రామమైన కల్హేర్ మండలం ఖానాపూర్ (కె) గ్రామంలో భాజపా ఓబీసీ మోర్చా సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఇటీవల నూతనంగా నియమితులైన శ్రీ కోణం విఠల్ పటేల్ , పెద్ద శంకరంపేట మండల అధ్యక్షులు శ్రావణ్ భాజపా యువ మోర్చా అధ్యక్షుడు కృష్ణ ధ్రువ కుమార్ మర్యాదపూర్వకంగా విజయపాల్ రెడ్డి ని కలిశారు. ఈ సందర్భంగా వారు నూతనంగా నియమితులైన కోణం విఠల్ పటేల్ కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. సంగారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీ పటిష్టత కోసం కృషి చేయాలని కోణం విట్టల్ కు సూచించారు.