ఫీజు రీయింబర్స్ మెంట్ పై ఉద్యమం ఉధృతం
విశ్వంభర, గన్‌పార్క్ : పాత విధానంలోనే ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేసి, పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం అని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. హైదరాబాదు గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద జులై 2న నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త కాలేజీల బంద్ పోస్టర్‌ను బీఆర్ఎస్ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, సీపీఐ సీనియర్ నాయకుడు అజీజ్ పాషా, బీసీ జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, పాత విధానాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పదివేల ర్యాంకు నిబంధనను రద్దు చేసి, పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. జులై 2న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్, జులై 15న బీసీ విద్యార్థులతో 'చలో హైదరాబాదు' కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల కాక వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం చేపట్టిన కాలేజీల బంద్‌కు బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో: బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ పాల్గొన్నారు.