భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
విశ్వంభర, రామన్నపేట: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం తమ ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గొరిగే సోము మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని దెబ్బతీసే విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు మళ్లించే జీవో నెం.12ను వెంటనే రద్దు చేసి, సంక్షేమ బోర్డు ద్వారానే అన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వమే నేరుగా అమలు చేయాలని కోరారు. సిఎస్సి సంస్థ ద్వారా నిర్వహిస్తున్న హెల్త్ టెస్టులను వెంటనే రద్దు చేసి, అర్హులైన ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి ఉచితంగా హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం సహజ మరణానికి అందిస్తున్న రూ.2 లక్షల నష్టపరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచాలని, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో పెండింగ్‌లో ఉన్న అన్ని క్లెయిమ్‌లకు వెంటనే నిధులు విడుదల చేసి, లబ్ధిదారులకు ఆలస్యం లేకుండా చెల్లింపులు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.భవన నిర్మాణ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని గొరిగే సోములు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు వంగాల మారయ్య, బుడ్డ ప్రసాద్, నాయకులు, నాగరాజు, జి.లింగ స్వామి, బి.చెన్నయ్య, బి.మల్లయ్య, రవి, వి.రమేష్, బి.యాదగిరి, సిహెచ్.శ్రీకాంత్, నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.