పౌర హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి
- పౌర హక్కుల దినోత్సవంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు దాసరి తిరుమలేష్
విశ్వంభర, మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని దత్తపుగూడెం గ్రామంలో తహసీల్దార్ జ్యోతి ఆధ్వర్యంలో మంగళవారం పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు దాసరి తిరుమలేష్ మాట్లాడుతూ. సమాజంలో అందరూ సమానులేనని, కుల వివక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన పెంచుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇటీవల నిర్వహించిన 'బెస్ట్ అవైలబుల్ స్కూల్' పథకంలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన విద్యార్థులను పారదర్శకంగా ఎంపిక చేసి న్యాయం చేయాలని కోరారు. గత రెండేళ్లుగా విద్యార్థులకు సంబంధించిన ఫీజు బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో మోత్కూర్‌లోని సేక్రెడ్ హార్ట్ హైస్కూల్ యాజమాన్యంపై ఆర్థిక భారం పడిందని, దీంతో ఈ విద్యా సంవత్సరంలో 5వ తరగతి విద్యార్థుల ప్రవేశాలపై ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేసి, 5వ తరగతి విద్యార్థుల్లో కూడా అర్హులను ఎంపిక చేసి విద్యను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మోత్కూర్ సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమానత్వాన్ని పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ఎవరైనా కుల వివక్షకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ యాదయ్య, హెచ్‌డబ్ల్యూఓ రాజాలు బాయి, ఆర్‌ఐ ఇంద్రకుమార్, నర్సింహా, జీపీఓ ఎల్లయ్య, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, గ్రామస్తులు మచ్చగిరి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.