కొత్తబస్టాండ్ సమీపంలో చెత్త తొలగింపు
విశ్వంభర, సూర్యాపేట: గత కొన్ని సంవత్సరాలుగా వర్షం వస్తే చాలు చెరువును తలపిస్తూ కాలువల్లో నీరు పోక మురుగు నీరు రోడ్డుపైకి వచ్చి దుర్వాసనకు గురవుతున్న కొత్త బస్టాండ్ వద్ద తిరిగే ప్రజలకు, వ్యాపారస్తులకు, ప్రయాణికులకు నేటితో విముక్తి కలిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ, ఏ ఐ సీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సహకారంతో మున్సిపల్ చైర్మన్ నివేదిత లక్ష్యాది ఆదేశాలమేరకు మున్సిపల్ సిబ్బంది కాలువలో పేరుకుపోయిన చెత్త, మురికినీరును తొలగించారు. బస్టాండ్ వాసుల కోరికమేరకు సుదీర్ఘ కాలంగా అమలుకు నోచుకోని మురికికాలువ పూడికను తీయించిన ఘనత సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గా మొరిశెట్టి నివేదిత లక్ష్యాది కే దక్కుతుందని కొత్తబస్టాండ్ సమీప ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.