రైతుభరోసా నిధుల విడుదల
విశ్వంభర, పెద్దశంకరంపేట: ప్రభుత్వం మంగళవారం సాయంత్రం రైతుభరోసా నిధులను విడుదల చేసింది. హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుభరోసా నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని అన్ని రైతువేదికలలో ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహించారు. స్థానిక రైతువేదికలో నిర్వహించిన వీసిలో ఏఓ కృష్ణతో పాటు రైతులు పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు. రైతులు ప్రభుత్వం అందిస్తున్న రైతుభరోసాను సద్వినియోగం చేసుకోవాలని ఏఓ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు వినీత్,అఖిల్, నస్రీన్ తదితరులున్నారు.