ఏజెన్సీ ప్రాంత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ చూపాలి .
టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్ .
విశ్వంభర, కొత్తగూడ, మండల కేంద్రం :-తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్, ఐజేయు కొత్తగూడ మండల కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడ మండలంలోని గుంజేడు ముసలమ్మ అమ్మ వారి ప్రాంగణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమం కి యూనియన్ మండల అధ్యక్షుడు ఎస్.కె. సల్మాన్ పాషా అధ్యక్షతన జరిగింది . అనంతరం సభ్యత్వాల పునరుద్ధరణ మరియు నూతన సభ్యత్వాల నమోదు కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు దూలం శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిపెళ్లి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు . ఈ కార్యక్రమము నీ ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, జర్నలిస్టుల ఐక్యతే యూనియన్ బలోపేతానికి మూలమని అన్నారు . ప్రతి జర్నలిస్టు యూనియన్ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడంతో పాటు కొత్తగా అర్హులైన జర్నలిస్టులు సభ్యత్వం పొందాలని సూచించారు . యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం నిరంతరం కృషి కొనసాగుతుందని తెలిపారు . ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అనేక ఇబ్బందులు, మౌలిక సదుపాయాల కొరత, రవాణా సమస్యలు, వృత్తిపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు . ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు . ఏజెన్సీ ప్రాంత ముద్దుబిడ్డ, రాష్ట్ర మంత్రి సీతక్క ఈ అంశంపై ప్రత్యేక చొరవ చూపి, ఏజెన్సీ ప్రాంత జర్నలిస్టుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు . జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నందున వారి సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.అనంతరం సభ్యులందరూ సభ్యత్వాల పునరుద్ధరణతో పాటు కొత్త సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు . సమావేశంలో యూనియన్ బలోపేతం, సభ్యుల ఐక్యత, జర్నలిస్టుల సంక్షేమం కోసం జిల్లా కమిటీ చేపట్టే కార్యక్రమాలకు పూర్తి సహకారం అందించాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు . ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉమ్మగాని మధు,రమణ, సత్యనారాయణ, కోరే పాపన్న, రావూరి ప్రశాంత్, పాలడుగు శ్రీధర్, జంగాల వినయ్ కుమార్, మహమ్మద్ అజ్మీర్, శెట్టి పరశురాములు, మండల ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, వెంకటేశ్వర్లు, మండల ముఖ్య సలహాదారులు సునీల్, ప్రచార కార్యదర్శులు ఉబ్బని శ్రీహరి, తీగల ప్రేమ్ సాగర్, రాకేష్ వర్మ, చాపల శ్రీనివాస్, నాంపల్లి రాజ్ కుమార్, వాసం వెంకటేష్, తాటి సుదర్శన్, బిక్షపతి, యూనియన్ నాయకులు, మండల ప్రతినిధులు, సభ్యులు మరియు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు .