పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలి
విశ్వంభర, అంబర్‌పేట : నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యతతో విధులు నిర్వహించినప్పుడే పోలీస్ శాఖకు మంచి పేరు వస్తుంది, ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పనిచేయాలని సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ జె. నరసయ్య అన్నారు. హైదరాబాదు అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో సీనియర్ కానిస్టేబుల్‌గా పనిచేసిన అరుణ పదవీ విరమణ సందర్భంగా మంగళవారం నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎలాంటి ఆరోపణలు లేకుండా సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన అరుణను అభినందించారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని అధికారులు, సిబ్బంది నిజాయితీగా, సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్, ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీ జగన్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ హఫీజ్ ఉద్దీన్, ఎస్సైలు తరుణ్, సంధ్య, సంయుజ్ జమ, ఏఎస్సై లక్ష్మణ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.