అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దారుణం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దారుణం

  • వృద్ధురాలిని హత్య చేసి నగదు, బంగారం దోపిడీ

విశ్వంభర, కళ్యాణదుర్గం:  కళ్యాణదుర్గం పట్టణంలో మంగళవారం సాయంత్రం దారుణ హత్య చోటు చేసుకుంది. కళ్యాణదుర్గం పట్టణంలోని ధర్మవరం రోడ్డులో గల వడ్డే కాలనీలో నివాసముంటున్న లక్ష్మీదేవి (75) వృద్ధురాలిని సాయంత్రం గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేసి చెవి కమ్మలను దోచుకెళ్లారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్య చేసి, సుమారు 3తులాల బంగారు నగలు, రూ.50 వేల నగదును అపహరించి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

🕒 01 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/atrocity-in-kalyanadurgam-of-anantapur-district/article-17545

Tags: