సభ్యత్వ నమోదు ఉద్యమంలా నిర్వహించాలి
- మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్
విశ్వంభర, ఇనుగుర్తి: బిఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉద్యమంలా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జులు, బూత్ లెవల్ ఏజెంట్ల, సర్ ప్రక్రియ పై ఇనుగుర్తి మండల కేంద్రంలో ఉమ్మడి మండల మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి మహేందర్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.సభ్యత్వ నమోదు,బి ఎల్ ఎ లకు పలు సూచనలు చేశారు.పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు ముమ్మరంగా చేపట్టాలని ప్రతి బూత్ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరిని పార్టీ సభ్యత్వంలో చేర్చేల కార్యచరణ చేపట్టాలని,అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగించకుండా కార్యకర్తలు భిఎల్ఏలు సైనికుల్లా అన్నారు. సర్ ప్రక్రియపై కార్యకర్తలకు పూర్తి అవగాహన ఉండి ప్రజలకు సరైన సమాచారం అందేలా కృషి చేయాలని సూచించారు.ఎన్నికల ముందు రైతుల తో పాటు అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేయించుకొని మోసం చేశారని కాంగ్రెస్ ను విమర్శించారు.లగచర్ల బాధితుల కై పోరాడితే నా గన్మెన్లను తీశేశారని ప్రజల కోసం పనిచేసి, ప్రజల్లో తిరిగేవారికి గన్మెన్లు అవసరం లేదని వారి ప్రేమే చాలన్నారు. ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదని పార్టీ సొమ్ముతిని పార్టీకి మోసం చేసిన వారిని వదిలేది లేదని పాలు తాగి రొమ్ము గుద్దే వారిని తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇనుగుర్తి తో పాటు ఉమ్మడి మండలంలోని వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.