మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నీర్నెముల గ్రామంలో, ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అదే గ్రామానికి చెందిన కన్నెబోయిన కృష్ణయ్య కుటుంబానికి నీర్నెముల గ్రామంలోని హనుమాన్ యూత్ సభ్యులు అంతా కలిసి రూ. 21,200 ల ఆర్థిక సహాయం అందించారు. కష్టకాలంలో వారి కుటుంబానికి మనం ఇచ్చిన ఈ చిన్న సహాయం కొంతమేర ధైర్యం ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని, యూత్ సభ్యులు అందరూ చూపించిన సహకారం, మనసు చాలా గొప్పదని, ఇలాగే ఇకముందు కూడా ఒకరికొకరం అండగా ఉండాలని హనుమాన్ యూత్ సభ్యులు కోరారు. అలాగే ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని కన్నెబోయిన కృష్ణయ్య భార్య కన్నెబోయిన పూజతో రోజూ వారి పనులలో కలిసి పనిచేసే మిత్రురాళ్లు అందరూ కలిసి కృష్ణ కుటుంబానికి రూ.10,000 (పదివేల రూపాయలు) ఆర్థిక సహాయం అందించడం జరిగింది.