ఇక సూర్యాపేట సర్వోత్తమ రెడ్డి దే
- నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
విశ్వంభర, సూర్యాపేట: గత ఎన్నికల్లో మా రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తమ్ రెడ్డి ఇంత చురుకుగా ఉంటే సూర్యాపేట మిస్ అయ్యేది కాదని ఈసారి బుల్లెట్ దిగుద్దని ఇక సూర్యాపేట మిస్ కాదని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దామన్న తనయుడు సర్వోత్తమ్ రెడ్డి గురించి మాట్లాడారు. దామన్న అమరత్వం పొందే వరకు ఆయన వ్యక్తిత్వాన్ని దగ్గర నుంచి చూసిన నాయకుల్లో నేను ఒకడినని దామన్నను దూరం నుంచి చూసి పులి అని భయపడేదని కానీ దగ్గర నుంచి చూస్తేనే దామన్నకు ప్రజల పట్ల ఉన్న అంకితబావం తెలిసిందన్నారు. తనను నమ్మిన ప్రజల కోసం వందలాది ఎకరాల భూమిని, ఆస్థులను దారపోసిన ఏకైక కాంగ్రెస్ నాయకుడు దామోదర్ రెడ్డి అన్నారు. దామన్న బాటలోనే ఆయన తనయుడు సర్వోత్తమ్ రెడ్డి ప్రజలకు సేవ చేస్తానని నాన్న ఆశయాలను ముందుకు తీసుకుపోతానని ప్రజలకు అండగా ఉంటానని మీ ముందుకు వస్తున్నాడన్నారు. విజ్ఞానవంతుడు మీ కోసం నిలబడే కమిట్ మెంట్ ఉన్న వ్యక్తి సర్వోత్తమ్ రెడ్డి అని అవినీతి రహిత పాలన అందించాలనే ఆలోచనతో వస్తున్న ఇలాంటి నాయకుడికి మనమంతా అండగా ఉండాలన్నారు. సర్వోత్తమ్ రెడ్డికి ఇప్పటికే ఉత్తమన్న అండ దండ మెండుగా ఉందని ఉత్తమన్న నాయకత్వంలో ముందుకు పోతుండని మా అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి చాలా చక్కగా పని చేసుకుంటూ పోతుండనే అభిప్రాయం ఉందన్నారు. మంత్రుల అండదండలు సర్వోత్తమ్ రెడ్డి కి ఉన్నాయని ప్రజలంతా సర్వోత్తమరెడ్డిని ఆదరించి వెంట నడవాలని పిలుపునిచ్చారు.