ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ 

విశ్వంభర, హుస్నాబాద్ : వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు ఈరోజు ఉదయం కర్నూలు నుండి  వనపర్తి కి వెళ్తుండగా రంగాపూర్ సమీపంలో జాతీయ రహదారి-44 పై ప్రమాదానికి గురైన ఘటన పట్ల రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్  తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులందరికీ మెరుగైన వైద్య చికిత్స అందించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ఘటన కు గల కారణాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీ తో, ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం లో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు తెలిసిందని, వారి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులకు సూచించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్టీసీ అధికారులు, పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది వేగంగా స్పందించి క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు.ఈ ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ నిర్వహించి, పూర్తి నివేదిక సమర్పించాలని ఆర్టీసీ అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. గాయపడిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని మంత్రి  పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/minister-ponnam-prabhakar-expressed-deep-regret-over-the-rtc-bus/article-17383

Tags: