సీతారామపురం జిపి రూ.4లక్షల 17 వేలు డ్రా సక్రమమే

  • తీర్మానాలు ఎంబీలు నోట్ ఫైల్స్ మేరకే నిధులు విడుదల
  • ఎంపివో బానోతు పద్మ వివరణ

విశ్వంభర, నెల్లికుదురు: మండలంలోని సీతారామపురం గ్రామపంచాయతీలో సర్పంచి రూ.4 లక్షల 17 వేలు నిధులు డ్రా చేయడం నిబంధనల మేరకు సక్రమమేనని ఎంపీ ఓ బానోతు పద్మ తెలిపారు.పనులేవీ చేయకుండానే అక్రమంగా డ్రా చేశారనే ఆరోపణలపై విలేకరులు గురువారం లేవనెత్తిన అంశాలపై ఎంపీవో బానోతు పద్మ స్పందించి వివరణ ఇచ్చారు. సీతారామపురం గ్రామపంచాయతీలో స్ట్రీట్ లైట్లు, మట్టి రోడ్లు, రోడ్లకు మట్టి పోయడం సంబంధించిన గ్రామపంచాయతీ పాలకమండలి తీర్మానాలు, సంబంధిత ఎంబీ రికార్డులు, నోట్ ఫైల్స్ ఆధారంగానే నిధుల డ్రాకు అనుమతించినట్లు ఎంపీవో పద్మ తెలిపారు. సంబంధిత పనులు ఏమి చేయకుండానే నిధులు విడుదల చేశారని కొందరు బలంగా ఆరోపణలు చేస్తున్నారని ఎంపీవో ఇంకా దృష్టికి తేగా ఆరోపణలు చేస్తున్న మాట నిజమేనన్నారు. సీతారామపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త బొలగం చంద్రారెడ్డి జిపి నిధులు ఎలా విడుదల చేశారని తనను అడిగినట్లు ఎంపీ ఓ వివరించారు. మాజీ సర్పంచ్ కి గతంలో చేసిన పనులకు బిల్స్ రావలసిందని తన దృష్టికి గురువారం తీసుకువచ్చారన్నారు. కాదా జిపి నిధులు తీర్మానాలు ఉపసర్పంచ్ సంతకం పంచాయతీ కార్యదర్శి సంతకాలు నోట్ ఫైల్స్ ఆధారంగానే నిధుల విడుదలకు అనుమతించినట్లు తెలిపారు. తనకు తెలిసినంతవరకు అక్రమాలేవీ కనిపించడం లేదని చెప్పారు.

🕒 12 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/sitaramapuram-gp-rs-4-lakhs-17-thousand-draw-is-valid/article-16596

Tags: