అంబేద్కర్ ఆశయాలను  ముందుకు తీసుకెళ్లాలి : ఈటెల

అంబేద్కర్ ఆశయాలను  ముందుకు తీసుకెళ్లాలి : ఈటెల

  విశ్వంభర,  ఘట్కేసర్: భారత్ ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ మీసాల అరుణ్ కుమార్  ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్  అంబేద్కర్ చౌరస్తా  వద్ద  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  విగ్రహానికి 250 వారం నిత్య పూల మాల కార్యక్రమంలో భాగంగా మల్కాజ్గిరి ఎంపీ  ఈటెల రాజేందర్  ఆదివారం పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్బంగా  ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ,   అంబేద్కర్ ఆశయాలను  మనమందరం ముందుకు తీసుకెళ్లాలని అన్నారు . ఈ కార్యక్రమంలో  ఘట్కేసర్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి  ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు, దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ  జాతీయ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత నర్రా రవి కుమార్,  కాంగ్రెస్ నాయకుడు బర్ల రాధాకృష్ణ  ముదిరాజ్,   మేకల దాసు,  బి ఆర్ ఎస్ నాయకుడు  మేకల నర్సింగ్ రావు ,   బిజెపి కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Tags:  

Advertisement

LatestNews