మాదక ద్రవ్యాల నివారణ పై అవగాహన
విశ్వంభర, మేడిపల్లి: బోడుప్పల్ సర్కిల్ మేడిపల్లి జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో విద్యార్థుల కోసం మాదకద్రవ్యాల నిరోధం పై జిల్లా స్థాయి ఓరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం జిల్లా విద్యాశాఖ అధికారి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జెడ్‌పిహెచ్‌ఎస్ మెడిపల్లి ప్రధానోపాధ్యాయులు L. సత్య ప్రసాద్ కోర్స్ కోఆర్డినేటర్గా, హేమలత జీసీడీఓ గా అలాగే G. విజయలక్ష్మి R P గా వ్యవహరించారు . ప్రత్యేక అతిథిగా K. సైదులు ఈగల్ టీమ్ ఏసీపీ కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు మరియు వాటి నుండి దూరంగా ఉండాల్సిన అవసరం గురించి అవగాహన కల్పించారు. ఒరియెంటేషన్ ప్రోగ్రాంలో ప్రతి పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థులు మరియు ఒక ఉపాధ్యాయుడు జిల్లాలోని 20 పాఠశాలల నుండి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఆరోగ్యకరమైన జీవన విధానం గురించి , విద్యార్థుల్లో మాదకద్రవ్యాలపై అవగాహన పెంపొందించి సమాజంలో వాటి నివారణకు కృషి చేయాలని సూచించారు.



