ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకుంటోంది: చల్ల నరసింహారెడ్డి

విశ్వంభర, మహేశ్వరం: ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులను చూసి బీఆర్ఎస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి ఆరోపించారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఫ్యూచర్ సిటీతో మహేశ్వరం ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు భూముల విలువ పెరిగి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఫ్యూచర్ సిటీపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేస్తున్న విమర్శలు రాజకీయ ప్రేరేపితమైనవని పేర్కొన్నారు. గతంలో ఫార్మా సిటీ పేరుతో ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టారని, ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. భూములు కోల్పోయిన రైతులకు మార్కెట్ ధర కంటే అధిక పరిహారం, ప్లాట్లు ఇచ్చామని తెలిపారు. ఫ్యూచర్ సిటీని ఎవరూ అడ్డుకోలేరని, ప్రజల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/challa-narasimha-reddy-brs-is-blocking-the-development-of-future/article-17358

Tags: