మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

విశ్వంభర,  నాగారం: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం డి.కొత్తపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు రావుల లింగమల్లు ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పరామర్శించారు. అనంతరం  నాగారం గ్రామానికి చెందిన రిటైర్డ్ అటెండర్ ఎలుక హనుమంతు మరణించడంతో ఆయన  పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి  కుటుంబ సభ్యులను జగదీష్ రెడ్డి పరామర్శించారు.  జగదీష్ రెడ్డి వెంట తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్,  నాగారం మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్లెట్లపెళ్లి ఉప్పలయ్య, కల్లట్లపల్లి శోభన్ బాబు,గుండగాని అంబయ్య గౌడ్, చిప్పలపల్లి సోమయ్య, యరాల  నరసింహారెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు ఈదుల కిరణ్ కుమార్, ఉప సర్పంచ్  వంగూరీ అంజి యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఎలుక సైదులు , మంచినీళ్ల మహేందర్ తీగుళ్ల యాదగిరి, రాములు, శ్రీనివాస్ , మధు తదితరులు ఉన్నారు.

Tags: