సురేష్ అంతిమ యాత్రలో పాడె మోసిన సర్పంచి

సురేష్ అంతిమ యాత్రలో పాడె మోసిన సర్పంచి

విశ్వంభర, నెల్లికుదురు: మండలంలోని కాస్య తండా శివారు ధర్మ గడ్డ తండాకు చెందిన బానోతు సురేష్ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో  మృతి చెందాడు. స్థానిక సర్పంచి బోడ నర్సింహ నాయక్ సోమవారం సురేష్ అంతిమయాత్రలో పాల్గొని పాడెమోశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, సురేష్ అందరితో ఆప్యాయంగా,కలివిడిగా ఉంటూ అకాల,ఆకస్మిక మృతి చెందడం తీవ్రంగా కలచివేస్తోందన్నారు. సురేష్ కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని వీరి కుటుంబం రెక్కాడితేనే డొక్కాడని వారని, ఇంటికి పెద్దదిక్కైన సురేష్ మృతి చెందడంతో కుటుంబం అనాధ అయిందని, ప్రభుత్వం ఆర్దిక సహాయం అందించి ఆదుకోవాలని సర్పంచి డిమాండ్ చేశారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/suresh-was-the-serpent-who-carried-pade-on-his-last/article-17427

Tags: