చేపల వ్యాపారులకు తాత్కాలిక స్థలం ఏర్పాటు చేయాలి
- శాశ్వత నాన్‌వెజ్ మార్కెట్ భవనాన్ని పూర్తి చేయాలి
- హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ గాదెపాక రవీందర్
విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్: హుస్నాబాద్ మున్సిపల్ పట్టణంలోని ఎల్లమ్మ బజార్ రోడ్డులో పాత ఎమ్మార్వో కార్యాలయం వద్ద గత కొన్ని సంవత్సరాలుగా సుమారు 20 మంది ముదిరాజ్ చేపల వ్యాపారులు తమ కులవృత్తిగా చేపలు విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. వీరితో పాటు మరో 15 మంది కార్మికులు కూడా ఈ వ్యాపారంపై ఆధారపడి కుటుంబాలను పోషిస్తున్నారు. ప్రస్తుతం అదే ప్రాంతంలో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో, నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతుందనే కారణంతో చేపల వ్యాపారులను అక్కడి నుంచి వెళ్లాలని కాంట్రాక్టర్ ప్రతినిధులు సూచించినట్లు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న హుస్నాబాద్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ 17వ వార్డు కౌన్సిలర్ గాదెపాక రవీందర్ ఆ స్థలాన్ని సందర్శించి చేపల వ్యాపారుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవనోపాధి కోసం ఎన్నో ఏళ్లుగా అక్కడే చేపల విక్రయాలు చేస్తున్న వారిని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా తొలగించడం సరైంది కాదన్నారు. నిర్మాణ పనులు కొనసాగించే క్రమంలో వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ అధికారులు తక్షణమే సమీపంలో తాత్కాలిక స్థలాన్ని కేటాయించి, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. అదేవిధంగా, 2022లో రూ.2.75 కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేసిన నాన్‌వెజ్ మార్కెట్ భవనం ఇప్పటికీ అసంపూర్తిగా ఉండడం బాధాకరమన్నారు. ప్రస్తుతం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో, అదే సమయంలో అసంపూర్తిగా ఉన్న నాన్‌వెజ్ మార్కెట్ భవనాన్ని కూడా పూర్తి చేసి చేపల వ్యాపారులకు శాశ్వతంగా దుకాణాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని, మున్సిపల్ అధికారులను కోరారు.స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమస్యపై ప్రత్యేక చొరవ తీసుకుని మా చేపల వ్యాపారుల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక ప్రత్యామ్నాయ స్థలాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, నాన్‌వెజ్ మార్కెట్ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి శాశ్వత వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తాత్కాలికంగా సరైన స్థలం, అవసరమైన సౌకర్యాలు కల్పించి, అనంతరం నాన్‌వెజ్ మార్కెట్ భవనం పూర్తయిన తర్వాత అందులో శాశ్వతంగా షాపులు కేటాయించాలని చేపల వ్యాపారులు మున్సిపల్ అధికారులను కోరారు.