దళిత క్రిస్టియన్ల సభను విజయవంతం చేయాలి
విశ్వంభర, మహబూబ్‌నగర్: దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ల పునరుద్ధరణను డిమాండ్ చేస్తూ ఈ నెల 17న మహబూబ్‌నగర్ పట్టణంలోని జేజేఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్న సభకు ముస్లిం రైట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఎంఆర్జేఏసీ) సంపూర్ణ సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా ఎంఆర్జేఏసీ కన్వీనర్ హనీఫ్ అహ్మద్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, మతం మారినంత మాత్రాన కుల వివక్ష తొలగిపోదని, దళిత క్రిస్టియన్లు ఇప్పటికీ సామాజిక వివక్షను ఎదుర్కొంటున్నారని అన్నారు. వారి జీవన పరిస్థితుల్లో ఆశించిన మార్పులు రాలేదని పేర్కొన్నారు. దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ల పునరుద్ధరణ అంశంపై ప్రభుత్వం, సంబంధిత వ్యవస్థలు సానుకూలంగా స్పందించాలని కోరారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా సామాజిక న్యాయం అందరికీ సమానంగా అమలు కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల 17న నిర్వహించనున్న సభకు ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ పరిరక్షకులు, సామాజిక సంస్థలు, సబ్బండ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై దళిత క్రిస్టియన్ల ఉద్యమానికి సంఘీభావం తెలపాలని హనీఫ్ అహ్మద్ పిలుపునిచ్చారు.