కల్తీ పాలు విక్రయిస్తున్న నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
On
విశ్వంభర, మహేశ్వరం : కందుకూర్ మండలం దాసర్లపల్లి గ్రామంలో ఉన్న యాదవ డైరీ మిల్క్ భూత్‌లో పాలను కల్తీ చేస్తున్నారనే సమాచారం అందడంతో, కందుకూరు పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళి మిల్క్ భూత్‌లో సోదాలు నిర్వహించగా అందులో మారమోని శ్రీశైలం అను వ్యక్తి ఉన్నాడు. ఆ యొక్క భూతులో సోదా చేయగా ఒక కెమికల్ బాటిల్ ఉన్నది, ఇదేమిటి అని అడగగా హైడ్రోజెన్ పేరోక్సిడె అని తెలిపినాడు. ఇది దేనికి ఉపయోగిస్తారు అని అడగగా, పాలు చెడిపోకుండా ఉండటానికి అని తెలిపాడు, అదే భూతులో సుమారు 80 లీటర్ల పాలు గుర్తించబడినవి. ఆ యొక్క పాలలో హైడ్రోజెన్ పేరోక్సిడె కలిపినావా అని అడగగా, కలిపినాను అని తెలిపాడు, దాంతో అట్టి వ్యక్తిని అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలు అడగగా, అతను చుట్టుపక్కల రైతుల వద్ద రాత్రివేళ పాలను కొనుగోలు చేసి, వాటిని తర్వాత రోజు ఉదయాన్నే హైదరాబాద్‌కు తీసుకెళ్లి హోటళ్లలో విక్రయిస్తున్నానని తెలిపినాడు, రాత్రి సమయంలో ఫ్రిడ్జ్ లో నిలువ చేస్తే విద్యుత్ ఛార్జీలు ఎక్కువ అవుతుందని, దాని వల్ల నెలకి దాదాపు 7,000 నుండి 8,000 వరకి పవర్ బిల్ వస్తుంది అని, అదే సమయంలో హైడ్రోజెన్ పేరోక్సిడె లీటర్ బాటిల్ 150/- దొరుకుతుండటంతో, దానిని ఉపయోగించటం వలన పాలు ఎక్కువ కాలం నిలువ ఉండటంతో పాటు ఖర్చు కూడా తక్కువ అవుతుంది అని భావించి, పాలను ఉదయం వరకు నిల్వ ఉంచేందుకు ప్రజల ఆరోగ్యానికి హానికరమని తెలిసినా హైడ్రోజెన్ పేరోక్సిడె కలిపి పాలను కల్తీ చేసి, వాటిని హైదరాబాద్‌కు తీసుకెళ్లి హోటళ్లలో విక్రయిస్తున్నానని స్వచ్ఛందంగా తన నేరాన్ని ఒప్పుకున్నాడు, దాంతో షాపులో అమ్మకానికి నిల్వ ఉంచిన 80 లీటర్ల పాలు ఉన్న మూడు పాల క్యాన్‌లు అలాగే 300 ఎం ఎల్ హైడ్రోజెన్ పేరోక్సిడె కలిగిన డబ్బాను స్వాధీనం చేసుకొని, నిందితుడు మారమోని శ్రీశైలం అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుని, కేసు నమోదు చేసి, దర్యాప్తు కోనసాగిస్తున్నాము అని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు, ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, కల్తీ పలు ప్రజల ఆరోగ్యానికి చాలా హానికరము, అలాగే ప్రజల ఆరోగ్యానికి హానికరమైన, నిషేధించబడిన పదార్థాలను ఎవరైనా విక్రయించినా వారి పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
🕒 11 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-police-arrested-the-accused-who-was-selling-adulterated-milk/article-15281