సిరిపురంలో ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు

సిరిపురంలో ఘనంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు

విశ్వంభర,  మర్పల్లి :  సిరిపురం గ్రామంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో గల రైతులందరూ కలిసి వారి వారి ఎడ్లను ముస్తాబు చేసి బండి కట్టి గ్రామంలో ఊరేగించారు. డప్పు చప్పుల నడుమ రైతులు నృత్యం చేస్తూ శ్రీ వీర భద్ర స్వామి ఆలయం చుట్టు ఎడ్ల బండ్లతో ప్రదక్షణలు చేశారు. సుమారు 20 ఎడ్ల బండ్లు ఈ ఊరేగింపులో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ దీదని రత్నం మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ రత్నం మాట్లాడుతూ ప్రతి యేట రైతులు అందరు ఇలా కలిసి మెలిసి ఏరువాక పౌర్ణమి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. రైతు అభివృద్ధికి ఏళ్ల వేళల గ్రామ స్థాయిలో తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు రైతులు పాల్గొన్నారు.

🕒 30 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/eruvaka-full-moon-celebrations-in-siripuram/article-17377

Tags: